Nitin Srileela : ఎక్స్ ట్రా కాంబో.. ఈసారైనా..?

Nitin Srileela నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 09:15 AM IST

Nitin Srileela నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో ముందు రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ఛాన్స్ లేకుండాపోయింది. అందుకే ఫైనల్ గా రాబిన్ హుడ్ కోసం శ్రీలీలని లాక్ చేశారు.

ఐతే ఆల్రెడీ నితిన్ తో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో శ్రీలీల నటించింది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది. మరి ఎక్స్ ట్రా కాంబో ఈసారి మళ్లీ రాబిన్ హుడ్ అంటూ వస్తున్నారు. ఈసారైనా ఈ కాంబో హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి.

ఛలో, భీష్మ రెండు సినిమాలతో డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ని కూడా ఆ రేంజ్ కు తగినట్టుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. భీష్మలో నితిన్ ని కొత్తగా చూపించిన వెంకీ ఈ సినిమాలో కూడా అలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇంతకీ రాబిన్ హుడ్ ఎలా ఉంటాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Also Read : Raviteja : దేవర ముంగిట నేనుంటా అంటున్న మాస్ రాజా..?