Site icon HashtagU Telugu

Nitin Rabinhood : నితిన్ సినిమా వాయిదా పడుతుందా..?

Nitin Rabinhood Likely postponed for 5 Days

Nitin Rabinhood Likely postponed for 5 Days

లవర్ బోయ్ నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ లాక్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమాను అనుకున్న డేట్ నుంచి వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. నితిన్ (Nitin) రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఒక ఐదు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 25న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

సక్సెస్ రేటులో వెనకపడ్డ..

మైత్రి మూవీ మేకర్స్ మరో 10 రోజులు పుష్ప 2 కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. నితిన్ వెంకీ కాంబోలో ఆల్రెడీ భీష్మ వచ్చి సక్సెస్ అయ్యింది. ఆ కాంబో లో వస్తున్న ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు. నితిన్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈమధ్య మళ్లీ కెరీర్ పరంగా సక్సెస్ రేటులో వెనకపడ్డ నితిన్ రాబిన్ హుడ్ (Rabinhood) తో సత్తా చాటాలని చూస్తున్నాడు.

నితిన్ తో పాటు రాబిన్ హుడ్ లో శ్రీలీల (Srileela) పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టేస్తుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంటుంది. పుష్ప 2 లో కిసిక్ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన శ్రీలీల మరి రాబిన్ హుడ్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి. నితిన్ మాత్రం ఈ సినిమా మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.

Also Read : Mokshagna : మోక్షజ్ఞతో కల్కి డైరెక్టర్.. భారీ బడ్జెట్ తో సినిమా..!