Site icon HashtagU Telugu

Nitin : నితిన్ భలే సెట్ చేసుకున్నడుగా..?

Nithin

Nithin

Nitin యువ హీరో నితిన్ లాస్ట్ ఇయర్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ భీష్మ తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రాబిన్ హుడ్ అంటూ రాబోతున్న ఈ సినిమా కూడా భీష్మ తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

వేణు శ్రీరాం డైరెక్షన్ లో తమ్ముడు అంటూ ఒక సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్లినట్టు టాక్. ఈ మూవీ తర్వాత నితిన్ మరో యువ దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఈటీవీ విన్ లో నైంటీస్ వెబ్ సీరీస్ తో అలరించిన డైరెక్టర్ ఆదిత్యా హాసన్ తో నితిన్ సినిమా లాక్ చేసుకున్నాడట.

మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమా తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా ఆదిత్యా హాసన్ అందించాడు. ఆ సినిమా హిట్ లో డైలాగ్స్ కూడా ప్రధానం అనిపించేలా చేశాడు. అందుకే నితిన్ ఆదిత్యా హాసన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నితిన్ తో ఆదిత్య ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.

Also Read : Summer 2024 : ప్రభాస్ ఒక్కడే.. మిగతా అంతా వాళ్లే..!

Exit mobile version