Nitin : మహేష్ అల్లు అర్జున్ బాటలో నితిన్ కూడా..?

Nitin స్టార్ హీరోలంతా కూడా సినిమాల ద్వారా వచ్చిన్ డబ్బుని కొంత వారి ఫ్యూచర్ సేవింగ్స్ కోసం ఉపయోగిస్తూ మరికొంత వారి బిజినెస్ డెవలప్ మెంట్

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 12:31 PM IST

Nitin స్టార్ హీరోలంతా కూడా సినిమాల ద్వారా వచ్చిన్ డబ్బుని కొంత వారి ఫ్యూచర్ సేవింగ్స్ కోసం ఉపయోగిస్తూ మరికొంత వారి బిజినెస్ డెవలప్ మెంట్ కోసం వాడుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్స్ వారు చేస్తున్న సినిమాలా ద్వారా వచ్చిన మొత్తాన్ని బిజినెస్ ల రూపంలో ఖర్చు చేస్తున్నారు. అఫ్కోర్స్ బిజినెస్ లో లాభాలు వస్తే అది డబుల్ అవుతుందనుకోండి. ఐతే ఇప్పటికే రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన స్టార్స్ మల్టీప్లెక్స్ బిజినెస్ లో కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే మహేష్ ఏసియన్ వారితో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ ఏర్పాటు చేయగా ఈమధ్యనే అల్లు అర్జున్ కూడా ఏసియన్ వారితో కలిసి ఏ.ఏ.ఏ సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ ని సిద్ధం చేశాడు. అంతేకాదు విజయ్ దేవరకొండ కూడా ఒక మల్టీప్లెక్స్ లో భాగం అయ్యాడు. ఇప్పుడు వీరి దారిలో నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నాడు. సంగారెడ్డిలో ఆల్రెడీ సింగిల్ స్క్రీన్ సితారని నడిపిస్తున్న నితిన్ దాన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఏసియన్ వారితోనే చేతులు కలిపి ఈ థియేటర్ ని రెనోవేట్ చేస్తున్నారని తెలుస్తుంది. సితార పేరుని కాస్త ఏ.ఎన్.ఎస్.ఎస్ మల్టీప్లెక్స్ గా మారుస్తున్నారట. తప్పకుండా ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చెప్పొచ్చు. ఇక నితిన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వేణు శ్రీరాం తో తమ్ముడు.. వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ సినిమాలు చేస్తున్నాడు.

Also Read : Ketika Sharma : కెతిక శర్మ మాస్టర్ పీస్ అందాలు..!