Site icon HashtagU Telugu

Nitin : సెట్స్ మీద రెండు.. లైన్ లో మరో రెండు..!

Nitin Robinhood Fight with Power Star Pawan Kalyan Hari Hara Veeramallu

Nitin Robinhood Fight with Power Star Pawan Kalyan Hari Hara Veeramallu

Nitin యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ ఒకటైతే.. వేణు శ్రీరాం డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు ఒకటి. ఈ రెండు సినిమాలతో మళ్లీ ఎలాగైనా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు నితిన్. ఐతే సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలే కాదు మరో రెండు క్రేజీ కాంబినేషన్స్ సినిమాలను సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేంటి అంటే.. తనకు ఇష్క్ లాంటి హిట్ ఇచ్చిన విక్రం కె కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నితిన్.

నితిన్ హీరోగా విక్రం కె కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత నైంటీస్ అనే వెబ్ సీరీస్ తో టాలెంట్ చూపించిన ఆదిత్య హసన్ (Aditya Hassan) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఓకే చేశాడట నితిన్. నైంటీస్ అనే వెబ్ సీరీస్ తో తన సత్తా చాటి ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసిన ఆదిత్య హాసన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నితిన్ తో చేస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమాను ఒక బడా నిర్మాత నిర్మిస్తారని టాక్. నైంటీస్ వెబ్ సీరీస్ తో పాటు ప్రేమలు తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసి సూపర్ అనిపించుకున్నాడు ఆదిత్య హాసన్. ఈ యువ దర్శకుడి టాలెంట్ చూస్తుంటే కచ్చితంగా అద్భుతాలు చేసేలా ఉన్నాడు. మరి నితిన్ తో ఆదిత్య మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రస్తుతం నితిన్ చేస్తున్న రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఐతే రాబిన్ హుడ్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ మారే చాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ రేసులో చరణ్, అల్లు అర్జున్ దిగడం వల్ల మిగతా సినిమాలు రిలీజ్ మార్చుకునే పరిస్థితి వచ్చింది.

Also Read  : King Nagarjuna : హమ్మయ్య ఓ టెన్షన్ తీర్చేసిన నాగార్జున..!