Nitin and Chaitanya : నితిన్, చైతన్య.. ఇపుడు ఏం చేస్తారు..?

యువ హీరో నితిన్ వెంకీ కుడుముల ఈ కాంబోలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్ (Robinhood). ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భీష్మ తర్వాత నితిన్ తో ఈ సినిమా చేస్తున్న వెంకీ కుడుముల ఇది కూడా ఎంటర్టైనింగ్ మోడ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అనుకున్నారు. ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య తండేల్ సినిమా కూడా క్రిస్మస్ కే రిలీజ్ ఫిక్స్ […]

Published By: HashtagU Telugu Desk
Nitin And Chaitanya Confusion With Ram Charan Game Changer

Nitin And Chaitanya Confusion With Ram Charan Game Changer

యువ హీరో నితిన్ వెంకీ కుడుముల ఈ కాంబోలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్ (Robinhood). ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భీష్మ తర్వాత నితిన్ తో ఈ సినిమా చేస్తున్న వెంకీ కుడుముల ఇది కూడా ఎంటర్టైనింగ్ మోడ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అనుకున్నారు. ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య తండేల్ సినిమా కూడా క్రిస్మస్ కే రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు క్రిస్మస్ కి చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ లాక్ చేశారు.

చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇండియన్ 2 (Indian 2) ఫ్లాప్ అవ్వడంతో శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ మీద మరింత ఫోకస్ పెట్టారు. ఐతే గేమ్ చేంజర్ క్రిస్మస్ కి రిలీజ్ అని రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు (Dill Raju) ప్రకటించారు. ఐతే అప్పటికే డిసెంబర్ చివర్లో అదే క్రిస్మస్ కి తండేల్, రాబిన్ హుడ్ సినిమాలు రిలీజ్ అనుకున్నారు.

మరి గేమ్ చేంజర్ వస్తున్నాడు అంటే ఈ సినిమాలకు కచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. ఐతే చరణ్ వస్తే ఈ సినిమాలు రెండు కచ్చితంగా వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంటుంది. తండేల్ సినిమా ఎలాగు గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ కాబట్టి డౌట్ లేదు. ఐతే మైత్రి బ్యానర్ లో వస్తున్న రాబిన్ హుడ్ రిలీజ్ వాయిదా వేస్తారా లేదా చరణ్ తో ఫైట్ షురూ అంటారా అన్నది చూడాలి.

రాం చరణ్ గేమ్ చేంజర్ సినిమా శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో వస్తుందని అర్ధమవుతుంది. దిల్ రాజు ఈ సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నారు.

Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ ఇక సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చా..?

  Last Updated: 22 Jul 2024, 07:03 PM IST