Nithya Menon: రియల్ లైఫ్ లో టీచర్ గా మారిన నిత్యా మీనన్.. పాఠం ఎలా చెబుతుందంటే?

తన అందంతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా ఉంటుంది.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 02:45 PM IST

Nithya Menon: తన అందంతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా మీనన్.. డౌన్ టు ఎర్త్ ఉంటుందనే టాక్ ఉంది. ఆమెకు హీరోయిన్ అనే గర్వం ఉండదని, అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడతారనే పేరు ఉంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమా షూటింగ్ మధ్యలో బ్రేక్ ఉండగా.. బ్రేక్ టైంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది నిత్యా మీనన్. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతూ టీచరమ్మ అవతారం ఎత్తింది. అయితే ఇది సినిమా షూటింగ్ లో భాగంగా కాకుండా.. ఆమె నిజంగానే పిల్లలకు పాఠాలు చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మలయాళీ అయిన నిత్యా మీనన్.. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఇంగ్లీష్ పాఠాన్ని తెలుగు వివరణతో ఎంతో చక్కగా వివరించింది.

సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాపురం అనే గ్రామానికి హీరోయిన్ నిత్యా మీనన్ చేరుకుంది. అయితే తన షూటింగ్ మధ్యలో బ్రేక్ దొరకడంతో.. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది నిత్యా మీనన్. అక్కడ పిల్లలతో కాసేపు ముచ్చటించిన నిత్యా మీనన్.. పుస్తకం తీసి పిల్లలకు సీరియస్ గా పాఠం చెప్పింది. తెలుగు విద్యార్థుల కోసం ఇంగ్లీష్ పాఠాన్ని చక్కగా తెలుగులో వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నిత్యా మీనన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది.

తాను పాఠం చెబుతున్న వీడియోను పోస్ట్ చేసిన నిత్యా మీనన్.. ‘పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతున్నారు. వాళ్ల చుట్టూ ఉన్నప్పుడూ ఎంతో సంతోషంగా ఉంటా’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు చాలా మంచి పని చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా నిత్యా మీనన్ తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, గీతా గోవిందం, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించింది.