Nithya Menon : పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్..?

కుటుంబ సభ్యులు , ఫ్రెండ్స్ ఒత్తిడి తెస్తుండడం తో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 11:31 AM IST

ఇటీవల కాలంలో సినీ నటి నటులంతా పెళ్లి పీటలు ఎక్కి..ఓ ఇంటి వారు అవుతున్నారు. మరికొంతమందైతే పెళ్లి చేసుకోకుండానే పిల్లలని కంటున్నారు అనుకోండి. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండగానే కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే.మరికొంతమంది మాత్రం ఛాన్సులు రాకపోవడం తో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఈ మధ్య చాలామంది ఇలాగే పెళ్లి చేసుకోగా..తాజాగా ఆలా మొదలైంది ఫేమ్ నిత్యా మీనన్ సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చిత్రసీమలో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ , ధనుష్ , నాని , నితిన్ వంటి హీరోలతో జత కట్టిన ఈమెకు..ప్రస్తుతం ఛాన్సులు రావడం లేదు. కొత్త హీరోయిన్ల రాక ఓ కారణమైతే..నిత్యా హైట్ కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఎన్ని రోజులు ఇలా ఛాన్సుల కోసం ఎదురుచూడడం..పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వొచ్చు కదా..అని కుటుంబ సభ్యులు , ఫ్రెండ్స్ ఒత్తిడి తెస్తుండడం తో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట.

తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కొంతకాలం క్రితం కూడా ఇలాగే నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వినిపించిన పెద్దగా జనాలు పట్టించుకోలేదు. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇదే విషయాన్ని నిజమే అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నిత్యామీనన్ పెళ్లి వార్త హల్ చల్ చేస్తో్ంది.

Read Also : Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్