Kumari Srimathi: ఓటీటీలో దూసుకుపోతున్న కుమారి శ్రీమతి, ప్రైమ్ లో ట్రెండింగ్

మేల్ స్టార్ పవర్ లేకుండా మంచి కంటెంట్ సాధించిన విజయం ఇది.

Published By: HashtagU Telugu Desk
Nitya Menon Kumari Srimathi

Nitya Menon Kumari Srimathi

స్వప్న సినిమాస్ వైజయంతి మూవీస్ అందించిన కుమారి శ్రీమతి విడుదలైన మూడవ వారంలో ఉంది. ఈ మూడు వారాల్లో థియేటర్లలో విడుదలైన సినిమాలు డజనుకు పైగానే ఉన్నాయి. అయితే OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా సినిమాలున్నాయి.  కానీ కుమారి శ్రీమతి వెబ్ సీరిస్ ను ఇప్పటికే చూసేవాళ సంఖ్య పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ టాప్-10 లిస్ట్‌లో వెబ్ సిరీస్ ఇప్పటికీ ఆరవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మేల్ స్టార్ పవర్ లేకుండా మంచి కంటెంట్ సాధించిన విజయం ఇది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పష్టమైన హాస్యం కలిపి మహిళా సాధికారత గురించి చక్కని కథతో నిర్మితమయ్యే ఈ వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్ టైటిల్ రోల్ పోషిస్తుంది.

ఇక కథ విషయానికి వస్తే.. భలే గమ్మత్తుగా ఉంది. తాత ఇచ్చిన ఆస్తిని బాబాయ్ లాగేసుకుని శ్రీమతి కుటుంబాన్ని బయటకు తోసేస్తాడు. దీంతో శ్రీమతి కోర్టుకి ఎక్కుతుంది. ఆ ఇంటిని తిరిగి సంపాదించే వరకూ పెళ్లి చేసుకోనని మెలిక పెడుతుంది శ్రీమతి. తీరా కోర్టు.. 6 నెలలోపు 38 లక్షలు ఇచ్చి ఇంటిని కొనుక్కోవచ్చని తీర్పు ఇస్తుంది. దీంతో రూ.13 వేల జీతానికి పనిచేసే శ్రీమతి రూ.38 లక్షలు సంపాదించడానికి ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది. అదే బార్.

అవును.. ఊర్లో బార్ పెట్టి.. అందర్నీ పీకలదాకా తాగించి.. రూ.38 లక్షలు సంపాదించడానికి నానా తిప్పలూ పడుతుంది. మరి మన శ్రీమతి.. ఆ రూ.38 లక్షలు సంపాదించిందా? ఆ ఇల్లును సాధించించా? చివరికి పెళ్లి చేసుకుందా? అన్నదే మిగిలిన కథ. అయితే ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ‘కుమారి శ్రీమతి’ చిత్రంలో నిత్యామీనన్, నిరుపమ్, తిరువీర్, గౌతమి, ప్రేమ్ సాగర్, నరేష్, బాబూ మోహన్ కీలకపాత్రలు పోషించగా.. గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. ఫన్ ట్రీట్‌గా ఉన్న ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

  Last Updated: 17 Oct 2023, 01:04 PM IST