Nithin: పవన్ కళ్యాణ్ టైటిల్‌తో హీరో నితిన్ కొత్త సినిమా.. డైరెక్టర్ కూడా పవన్ అభిమానే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో హీరో నితిన్ (Nithin) కూడా ఒకరు. అయితే నితిన్ మరోసారి తన అభిమాన హీరోపై అభిమానాన్ని చూపాడు. ఇప్పుడు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nithin

Compressjpeg.online 1280x720 Image 11zon

Nithin: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో హీరో నితిన్ (Nithin) కూడా ఒకరు. అయితే నితిన్ మరోసారి తన అభిమాన హీరోపై అభిమానాన్ని చూపాడు. ఇప్పుడు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. నితిన్ కథానాయకుడిగా ఆదివారం కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి “తమ్ముడు” అనే టైటిల్ ఖరారు చేశారు.

హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాగా ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. మరోవైపు నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులోనూ శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే నితిన్ “తమ్ముడు” సినిమాని ఓకే చేశాడు. ఈ సినిమాకి వకీల్ సాబ్ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.

Also Read: OG Teaser: అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌తో పవన్ “ఓజీ” మూవీ టీజర్‌.. 72 సెకన్లు విధ్వంసమేనా..!?

దర్శకుడిగా వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA), వకీల్ సాబ్ సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలు అన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే వేణు శ్రీరామ్ చేశారు. ఇప్పుడు నితిన్ “తమ్ముడు” మూవీని కూడా ఆ సంస్థలో చేస్తున్నారు. దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు నిర్మాణ సంస్థలో నితిన్ చేస్తున్న మూడో చిత్రమిది. ”రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది. కొత్త తమ్ముడు వస్తున్నాడు” అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.

  Last Updated: 27 Aug 2023, 12:51 PM IST