Site icon HashtagU Telugu

Thammudu : ‘తమ్ముడు’ ఫిక్స్ అయ్యినట్లుంది..మరి ఏంజరుగుతుందో..?

Thammudu Release Date

Thammudu Release Date

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నితిన్ (Nithin)..ప్రస్తుతం ఆశలన్నీ తమ్ముడు (Thammudu) మూవీ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నితిన్‌కు మంచి విజయంగా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని ఈ ఏడాది జూలై 4న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిందన్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి మార్పులు లేకుండా నిర్ణీత తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Vishwambhara : ట్రోల్స్ దెబ్బకు.. పెరిగిన చిరంజీవి ‘విశ్వంభర’ VFX బడ్జెట్.. ఎన్ని కోట్లు తెలుసా?

ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటి లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్కా-తమ్ముడి భావోద్వేగాలతో నిండిన కథతో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. కుటుంబ కథా చిత్రాలపై ఆసక్తి కలిగిన ప్రేక్షకులకు ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నితిన్ కెరీర్‌లో మలుపు తిప్పే చిత్రంగా “తమ్ముడు” నిలుస్తుందేమో చూడాలి. గతంలో వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి ఇప్పుడు పవన్ టైటిల్ తో రాబోతుండడంతో ఈసారి కూడా హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.