Extra Ordinary Man Trailer : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఇది నిజంగానే ఎక్స్‌ట్రా ఆర్డినరీ

హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాకు వక్కంతం వంశీ డైరెక్టర్.

Published By: HashtagU Telugu Desk
Nithiin Extra Ordinary Man Movie Release Date Preponed due to Prabhas Salaar

Nithiin Extra Ordinary Man Movie Release Date Preponed due to Prabhas Salaar

Extra Ordinary Man Trailer : హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాకు వక్కంతం వంశీ డైరెక్టర్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. వక్కంతం వంశీ అనగానే మనకు గుర్తొచ్చే మూవీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా వంశీ ఏమాత్రం నిరాశ చెందకుండా మరోసారి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

హరీష్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఫుల్ టు ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై సంచలనాలను సృష్టించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నితిన్ డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. జూనియర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో నితిన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ మూవీ ట్రైలర్ పై ఓ లుక్కేసుకోండి మరి.

  Last Updated: 27 Nov 2023, 07:03 PM IST