Site icon HashtagU Telugu

Ra Ra Reddy Record: 500 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ‘రారా రెడ్డి’ సాంగ్!

Ra Ra Reddy

Ra Ra Reddy

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకర్గం ఆగస్టు 12న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అటు మాస్‌లోనూ ఇటు క్లాస్‌లోనూ అంచ‌నాలు పెంచేసింది. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన రారా రెడ్డి పాట దూసుకుపోతోంది. నితిన్ డ్యాన్స్, అంజలి గ్లామర్‌తో పాటు ‘రాను రాను అంటూనే చిన్నదో’ పాటలోని హుక్ లైన్ పాటను హైలైట్ చేశాయి. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాట యూబ్యూట్, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ పాట ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి ట్రెండింగ్ నిలిచింది. ఏ సినిమాకు దక్కని అరుదైన ఘనత నితిన్ సినిమాకు దక్కింది.