Site icon HashtagU Telugu

Nithiin Thammudu Movie: నితిన్ తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Nithiin Thammudu Movie

Nithiin Thammudu Movie

నితిన్ గతంలో వరుసగా హిట్స్ అందుకున్నా, ఇటీవల కొంచెం స్లో అయ్యాడు. కానీ, డిసెంబర్‌లో “రాబిన్ హుడ్” సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మరొక ఆసక్తికర ప్రాజెక్ట్‌పై కూడా పనిచేయనున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఉపయోగించాలని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడు అనే టైటిల్‌ను నితిన్ కొన్నాళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించబడుతోంది.

“పవన్ కళ్యాణ్ తమ్ముడు” సినిమాలో అన్న-తమ్ముడు సెంటిమెంట్ ఉంటే, నితిన్ నటిస్తున్న “తమ్ముడు” సినిమాలో అక్క-తమ్ముడు సెంటిమెంట్ ఉండనుంది. ఈ సినిమాలో నితిన్‌కు అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుంది. ఇటీవల, తమ్ముడు సినిమాకు సంబంధించి కొత్తగా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

నితిన్ నటించిన “తమ్ముడు” సినిమా 2025 మహాశివరాత్రికి విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు. పోస్టర్‌లో, నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకొని, చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకుని, వెనకాల కొంతమంది తరుముతుంటే పరిగెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇది ఓ మంచి యాక్షన్ సీన్ నుంచి తీసిన ఫోటోగా భావిస్తున్నారు.

ఈ పోస్టర్ చూసినప్పుడు, అక్క కూతుర్ని కాపాడటానికి తమ్ముడు ఏం చేశాడనే కథాంశం ఉంటుందా అని సందేహం కలుగుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.