Site icon HashtagU Telugu

Thammudu : ప్లాప్‌ల్లో ఉన్న నితిన్ సినిమాలోని.. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం అన్ని కోట్లా..

Nithiin Venu Sriram Thammudu Movie Action Sequence Update

Nithiin Venu Sriram Thammudu Movie Action Sequence Update

Thammudu : టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస పరాజయాలో ఉన్నారు. ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ తరువాత ఐదు సినిమాలు తీసుకు వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఒకటి విజయం సాధించలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కూడా నితిన్ ఆశలను నిరాశలు చేసింది. దీంతో నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారు. హిట్ కాంబినేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈక్రమంలోనే బీష్మ సినిమా దర్శకుడుతో ‘రాబిన్ హుడ్’ సినిమా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ‘తమ్ముడు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. నితిన్ పై ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 50 మంది ఫైటర్స్ తో ఈ ఫైట్ ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారట.

ఇక ఈ సీక్వెన్స్ కోసం మేకర్స్ అక్షరాలా 8 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్.. ప్రెజెంట్ ప్లాప్ ల్లో ఉన్న నితిన్ సినిమాలోని ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం ఇన్ని కోట్లు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వకీల్ సాబ్ డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ని చూసి.. ఆ భారీ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చూపిస్తున్నారు.

కాగా ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తన సోదరి కోసం ఎంత దూరమైన వెళ్లే బ్రదర్ రోల్ లో నితిన్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటిస్తున్న సమాచారం.