Nithiin : ప్రభాస్ దెబ్బకి నితిన్ కూడా సైడ్ అయిపోయాడు..

ఇప్పుడు ప్రభాస్ దెబ్బకి నితిన్ కూడా తన సినిమాని ముందుకి తీసుకొచ్చాడు. తాజాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Nithiin Extra Ordinary Man Movie Release Date Preponed due to Prabhas Salaar

Nithiin Extra Ordinary Man Movie Release Date Preponed due to Prabhas Salaar

నితిన్(Nithiin) మాచర్ల నియోజకవర్గం సినిమా తర్వాత ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man) అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. అదే డేట్ కి పలు సినిమాలు కూడా ప్రకటించారు. కానీ ప్రభాస్ సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22 కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిగిలిన హీరోలు తమ సినిమాలని ముందుకు, వెనక్కి జరుపుకుంటున్నారు. ఇప్పటికే వెంకటేష్ సైంధవ్ సినిమా సంక్రాంతికి వెళ్లగా, నాని హాయ్ నాన్న సినిమా ముందుకు రానుంది.

ఇప్పుడు ప్రభాస్ దెబ్బకి నితిన్ కూడా తన సినిమాని ముందుకి తీసుకొచ్చాడు. తాజాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. డిసెంబర్ 8న నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read : Ambajipeta Marriage Band : కలర్ ఫోటో సుహాస్ కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీజర్ చూశారా?

 

  Last Updated: 09 Oct 2023, 08:48 PM IST