చిరంజీవి , కమల్ హాసన్, రజనీకాంత్‌ల సరసన నటించిన గ్లామర్ డాల్ నిషా నూర్ (Nisha Noor) ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన విషయం ఇప్పుడు అందర్నీ మాట్లాడుకునేలా చేస్తుంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, 1980ల కాలంలో కె. బాలచందర్, భారతీరాజా వంటి దిగ్గజ దర్శకులతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. బోల్డ్ పాత్రల్లో ఈమె ఎక్కువగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో రాజేంద్ర ప్రసాద్, భానుచందర్‌ల చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ నటి, తన అందచందాలతో అప్పట్లో బీ-గ్రేడ్ గ్లామర్ సినిమాల్లో బాగా పాపులర్ అయ్యింది.
YSRCP : మరోసారి జగన్ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !
అయితే కెరీర్ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిషా నూర్ ఓ నిర్మాత వలలో పడింది. అవకాశాలు కల్పిస్తానని నమ్మించి ఆమెను వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టివేయడంతో, ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా దివాళా తీయడం, కుటుంబ సహాయం లేకపోవడంతో వ్యభిచారమే జీవనాధారంగా మారింది. అవకాశాలు లేకపోయినా, బయటకు రావాలన్న సాహసం చేయక పోవడంతో ఆమె ఈ వృత్తిలోనే కొనసాగింది. అది ఆమె ఆరోగ్యాన్ని, జీవితాన్నే నాశనం చేసింది.
చివరికి నిషా నూర్ ఓ దర్గా బయట నిరాశ్రయ స్థితిలో ఉండటం గుర్తించిన ఓ ఎన్జీవో సంస్థ ఆమెను ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆమె శరీరం బక్కచిక్కిపోయి, గుర్తుపట్టలేని స్థితికి చేరింది. వైద్య పరీక్షల అనంతరం నిషా ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. సినిమాల్లో వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్, చివరికి ఎయిడ్స్‌తో 2007లో కేవలం 44 ఏళ్ల వయస్సులో మరణించిందంటే, ఆమె జీవితం ఎంత విషాదకరంగా మారిపోయిందో అర్థమవుతుంది. నిషా నూర్ కథ సినిమా ప్రపంచంలో లైంగిక వాడుక, మోసాలపై మనం ఆలోచించాల్సిన ఉదాహరణగా నిలుస్తోంది.