Site icon HashtagU Telugu

Nirmal Benny : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ..ఫేమస్ నటుడు మృతి

Nirmal Benny Dies

Nirmal Benny Dies

సినీ పరిశ్రమ లో వరుస విషాదాలు వీడడం లేదు. ఒకరు కాకపోతే ఒకరు మరణిస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తుంటే..మరికొంతమంది రోడ్ ప్రమాదాల్లో , ఇంకొంతమంది వయసు రీత్యా కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటు మరణాలు అనేవి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ముందు వరకు కూడా గుండెపోటు మరణాలు చాల తక్కువగా ఉండేవి..కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా వస్తున్నాయి. అప్పటి వరకు మన మద్యే ఎంతో హుషురూగా ఉన్న వ్యక్తులు సడెన్ గా కుప్పకూలి మరణిస్తున్నారు. తాజాగా మలయాళ చిత్రసీమలో అలాంటిదే జరిగింది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని (Nirmal Benny ) (37) కన్నుమూశారు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

తన ప్రియ మిత్రుడికి శాశ్వత శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నిర్మాత కూడా రాసుకొచ్చారు. నిర్మల్ వి బెన్నీ కామెడీ షోల ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. నిర్మల్ వి బెన్నీ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఆయన 2012లో విడుదలైన వెల్‌కమ్ టు న్యూబీస్ చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆమెన్‌లో కొచ్చాచన్ పాత్ర ఆయనని నటుడిగా పాపులర్ చేసింది. నిర్మల్ వి బెన్నీ ధార అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. అతి చిన్న వయసులోనే కన్నుమూయడం పట్ల చిత్రసీమ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Telangana PCC Chief : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్