యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ నటించారు. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల థియేటర్‌లో విడుదలై యువతకు ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉన్న ఈ సినిమాను, అమెజాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. “రిషి, తారల ప్రేమకథను చూడండి,” అని పోస్ట్‌లో పేర్కొంది. ఇక, ఓటీటీ వేదికపై కూడా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
high OCTANE thrill meets breezy ROMANCE – Rishi & Tara's story is an eclectic mix of all 🔥🫰#AppudoIppudoEppudoOnPrime, watch now: https://t.co/E13aHqpQOn pic.twitter.com/apBDEZ56Gw
— prime video IN (@PrimeVideoIN) November 26, 2024
కథ విషయానికొస్తే:
రేసర్ కావాలన్నది రిషి (నిఖిల్) యొక్క కల. తన జీవితంలో ప్రేమ కోసం ఎదురుచూస్తున్న అతను, తార (రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమ ఫలించదు. తన కల అయిన రేసర్ అవడమే ముఖ్యం అనుకుని లండన్ చేరుకుంటాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ పార్ట్-టైమ్ పనిచేస్తాడు. అదే సమయంలో, అక్కడ తులసి (దివ్యాంశ కౌశిక్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిన రిషి పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తాడు. ఇద్దరూ గుడికి వెళ్లి పెళ్లి చేసుందాం అనుకుంటారు.
కానీ, ఇంతలోనే తులసి ఆచూకీ లేకుండా మాయం అవుతుంది. ఆపై, తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లిపోయింది? ఆమె కోసం రిషి వెతుకుతూ, తన జ్ఞానాన్ని ఎంతదూరం తీసుకెళ్లాడో? అంతేకాక, రిషి హైదరాబాద్‌లో ప్రేమించిన తార మళ్లీ లండన్‌కు ఎందుకు వచ్చిందో? వీళ్లందరితో సంబంధం ఉన్న లోకల్ డాన్ బద్రీనారాయణ (జాన్ విజయ్) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) సినిమా చూడాల్సిందే!