Site icon HashtagU Telugu

RRV Collections: మెగాహీరోకు షాక్.. RRV కంటే కార్తీకేయకే అత్యధిక కలెక్షన్స్

Karthikeya

Karthikeya

పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (RRV) శుక్రవారం విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అయిన ఈ మూవీ యువతను ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఈ సినిమాకు కలెక్షన్లు బాగా తగ్గాయి. నాలుగో వారంలో నడుస్తున్న ‘కార్తికేయ 2’ శుక్రవారం చాలా సెంటర్లలో కొత్త విడుదలైన ‘RRV’ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం “ఉప్పెన”తో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు కానీ ఆ చిత్రం విజయం అతనికి బూస్టింగ్ ఇవ్వలేకపోయింది. రివ్యూలతో సంబంధం లేకుండా ఓపెనింగ్ డే కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ “RRV” ఘోరంగా విఫలైమంది. మరోవైపు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పూర్తిగా వాష్ అవుట్ అయింది. చాలా థియేటర్లలో కేవలం 15 లేదా 20 మంది మాత్రమే వచ్చారు.