Site icon HashtagU Telugu

Hero Nikhil : తండ్రి కాబోతున్న హీరో నిఖిల్..

Nikhil Wife

Nikhil Wife

అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil )..అతి త్వరలో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి సంతోషం నింపారు. ఈ సందర్బంగా భార్య పల్లవి (Pallavi Varma) సీమంతం (Seemantham) ఫొటోలను షేర్ చేసారు. ‘మా మొదటి బిడ్డ అతి త్వరలోనే రానుంది. పల్లవి, నేను చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి మీ దీవెనలు పంపండి’ అని ట్విట్టర్ Xలో కోరారు.ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు , అభిమానులు నిఖిల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హ్యాపీ డేస్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్..ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ వస్తున్నారు. స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ , కార్తికేయ 2 , 18 పేజెస్ ఇలా సరికొత్త కథలతో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2020 లాక్ డౌన్ సమయంలో నిఖిల్ తన ప్రేయసి పల్లవిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ జంట పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. కాగా, నిఖిల్-పల్లవి విడిపోతున్నారు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే త్వరలో విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై నిఖిల్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. తన భార్యతో క్లోజ్ గా ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ విడాకుల వార్తలకు చెక్ పడింది. ఇక ఇప్పుడు త్వరలో తండ్రి కాబోతున్నట్లు తెలిపి వార్తల్లో నిలిచారు నిఖిల్.

Read Also : YCP 5th List : వైసీపీ ఐదో జాబితా విడుదల..ఎవరికీ పదవి దక్కిందంటే..