Site icon HashtagU Telugu

SPY Trailer : నిఖిల్ ‘స్పై’ టీజర్ అదిరిందిగా.. రానా గెస్ట్ అప్పీరెన్స్..

Nikhil Siddhartha Spy Trailer Released Rana Guest Appearance thrilled

Nikhil Siddhartha Spy Trailer Released Rana Guest Appearance thrilled

కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్(Nikhil). ఇప్పుడు మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు స్పై సినిమాతో. పాన్ ఇండియా సినిమాగా స్పై(SPY) జూన్ 29న రిలీజ్ కానుంది. నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ దర్శకత్వంలో స్పై తెరకెక్కింది. సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనక ఉన్న సీక్రెట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన స్పై టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా స్పై ట్రైలర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు, దాస్తోంది అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్ లతో సాగింది. నిఖిల్ ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఓ వ్యక్తిని పట్టుకోవడానికి నిఖిల్ అండ్ టీం స్పైలుగా పని చేస్తూ ఉంటారు. అలాగే నిఖిల్ సొంత పగ కూడా తీర్చుకోవడానికి, ఈ దారిలోనే సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవడం.. ఇలా ఆసక్తిగా సాగింది. చివర్లో రానా ఎంట్రీ ఇచ్చి.. స్వతంత్రం అంటే ఒకరిచ్చింది కాదు, లాక్కునేది ఇది నేను చెప్పట్లేదు సుభాష్ చంద్రబోస్ చెప్పారు అంటూ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషినట్టు తెలుస్తుంది.

దీంతో సినిమాలో రానా గెస్ట్ అప్పీరెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో రానాని చూసి అంతా షాక్ అయ్యారు. ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ లో నిర్వహించారు.

 

Also Read : Manoj Bajpayee : అక్కడ మద్యం ఫ్రీ అని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేసిన మనోజ్‌ బాజ్‌పాయ్.. ఎక్కడో తెలుసా?