Site icon HashtagU Telugu

Nikhil Siddhartha: ఘనంగా హీరో నిఖిల్ కొడుకు బారసాల కార్యక్రమం.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Mixcollage 17 Mar 2024 03 23 Pm 9654

Mixcollage 17 Mar 2024 03 23 Pm 9654

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాడు నిఖిల్. కాగా నిఖిల్ నటించిన సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలని నెక్స్ట్ లైన్ లో పెట్టాడు నిఖిల్.

ఇకపోతే నిఖిల్ పల్లవి అనే డాక్టర్ ని ప్రేమించి నిఖిల్ 2020లో కరోనా సమయంలో సింపుల్ గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి ఇటీవల ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడని నిఖిల్ అధికారికంగా తెలిపాడు. తాజాగా నిఖిల్ తనయుడి బారసాలని నిన్న ఘనంగా నిర్వహించారు. నిఖిల్ ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ బారసాల వేడుకని జరిపినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఒక రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒక ఫొటోలో నిఖిల్, పల్లవి తమ బాబుని ఎత్తుకొని చూస్తుండగా మరో ఫొటోలో బాబుని ఉయ్యాలలో వేసి ఆడిస్తున్నారు.

ఇక బాబు ఫేస్ కనిపించకుండా పేస్ పై లవ్ సింబల్ పెట్టడం గమనార్హం. అయితే బాబుకి ఏం పేరు పెట్టారు అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించి నిఖిల్ అధికారికంగా బాబు పేరుని ప్రకటిస్తాడేమో చూడాలి మరి.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.