Nikhil Siddhartha : నాకు కొంతమంది డ్రగ్స్ ఆఫర్ చేశారు.. అవి తీసుకొని ఉంటే.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..

నిఖిల్ మాట్లాడుతూ నాకు కూడా గతంలో కొందరు డ్రగ్స్ ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో నిర్మాత KP చౌదరి డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో నిఖిల్ ఇలా డ్రగ్స్ పై కామెంట్స్ చేయడంతో నిఖిల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Published By: HashtagU Telugu Desk
Nikhil Siddhartha sensational comments on Drugs

Nikhil Siddhartha sensational comments on Drugs

తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(Telangana Anti Narcotics Bureau) డ్రగ్(Drugs) దుర్వినియోగం & డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నేడు పరివర్తన కార్యక్రమం నిర్వహించింది. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా మూడు రోజుల పాటు ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్(Hyderabad) లో పలువురు స్టూడెంట్స్, ప్రముఖులతో ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు(Police). ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులతో పాటు హీరో నిఖిల్(Nikhil Siddhartha), నటుడు ప్రియదర్శి(Priyadarshi) కూడా పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ నాకు కూడా గతంలో కొందరు డ్రగ్స్ ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క టాలీవుడ్ లో నిర్మాత KP చౌదరి డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో నిఖిల్ ఇలా డ్రగ్స్ పై కామెంట్స్ చేయడంతో నిఖిల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు కొంతమంది చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. ఆ రోజు డ్రగ్స్ తీసుకొని ఉంటే హ్యాపీడేస్ సినిమా ఉండేది కాదు. సినిమాల్లోకి వచ్చాక కూడా కొంతమంది డ్రగ్స్ ఆఫర్ చేశారు. అప్పుడు కూడా తీసుకోలేదు. అప్పుడు తీసుకుంటే మొన్న కార్తికేయ 2 వచ్చి ఉండేది కాదు. డ్రగ్స్ కి అందరూ దూరంగా ఉండాలి. నార్కోటిక్స్ కి అలవటు పడితే అదే డెత్ సెంటన్స్. మన చావుని మనమే ఆహ్వానించినట్టే డ్రగ్స్ తీసుకుంటే. పేరెంట్స్ కూడా పిల్లలు చేస్తున్న పనులు గమనించాలి. స్టూడెంట్స్ కి ఎంతో భవిష్యత్తు ఉంది. డ్రగ్స్ కి దూరంగా ఉండండి. పార్టీలకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకండి. తెలంగాణ పూర్తిగా డ్రగ్ ఫ్రీ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

  Last Updated: 24 Jun 2023, 08:57 PM IST