Site icon HashtagU Telugu

Nikhil Siddhartha : అభిమానులకు సారీ చెప్పిన హీరో నిఖిల్.. ఆ సినిమా విషయంలో..

The India House

The India House

పాన్ ఇండియా సినిమాలతో హీరో నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే స్పై(SPY) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా నిలిచింది. ఇక స్పై సినిమా ఇప్పటికే 25 కోట్లు కలెక్ట్ చేసింది.

అయితే స్పై సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేద్దామనుకున్నా సమయం లేకపోవడంతో వేరే భాషల్లో డబ్బింగ్ లేకుండానే తెలుగులోనే రిలీజ్ చేశారు. డబ్బింగ్ తో వేరే భాషల్లో కూడా రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవని సమాచారం. దీనిపై నిఖిల్ స్పందిస్తూ తాజాగా అభిమానులకు సారీ చెప్తూ ఓ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నిఖిల్ ఈ లెటర్ లో.. స్పై సినిమా థియేటర్స్ కి వచ్చి చూసినందుకు, బాక్సాఫీస్ వద్ద నా కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ని అందించినందుకు మీ అందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నాపై ఎంత నమ్మకం ఉందో ఇలా తెలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొన్ని కాంట్రాక్ట్, కంటెంట్ సమస్యల కారణంగా ఈ సినిమా భారతదేశం అంతటా అన్ని భాషల్లో విడుదల అవ్వలేదు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. ఓవర్సీస్ లో కూడా తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. నేను హిందీ, కన్నడ, తమిళం, మలయాళం ప్రేక్షకుల అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నా తదుపరి రాబోయే 3 సినిమాలు మాత్రం అన్ని భాషల్లో థియేటర్లలో ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేసి టైమ్‌కి రిలీజ్ చేస్తాను. ఇక నుంచి నేను దేనికి రాజీపడను. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా మంచి అవుట్ పుట్ ఇస్తాను అని తెలిపాడు. దీంతో నిఖిల్ లెటర్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం నిఖిల్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ది ఇండియా హౌస్, స్వయంభు, మరో భారీ సినిమా ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్స్ మొదలవుతాయి.

Also Read : Pawan Kalyan – Anna Lezhneva : బయటకు వచ్చిన పవన్ భార్య.. రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారుగా..