Pawan Kalyan : మెగా ఫ్యామిలీ వీడియో చూసి.. ఇతర హీరోలు కూడా ఎమోషనల్..

మెగా ఫ్యామిలీ వీడియో చూసి అభిమానులు మాత్రమే కాదు ఇతర హీరోలు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 10:45 AM IST

Pawan Kalyan : సినిమా పరిశ్రమలో తనకి ఉన్న స్టార్ హోదాని పక్కన పెట్టి, ప్రజల కోసం రాజకీయాల్లోకి వెళ్లి ఎన్నో మాటలు, అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా, మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏపీ ఎన్నికల్లో చక్రం తిప్పి అదుర్స్ అనిపించారు. ఇక ఇన్నాళ్లు ప్రజల కోసం తన కుటుంబానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రచ్చ గెలవడంతో మళ్ళీ ఇంటికి చేరుకున్నారు.

నిన్న చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ రావడంతో.. మెగా కుటుంబం ఘన స్వాగతం పలికింది. దశాబ్ద పోరాటం తరువాత ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ని చూసి మెగా ఫ్యామిలీ అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో మొత్తం కుటుంబంసభ్యులు పవన్ ని అభినందిస్తూ ఇంటికి స్వాగతం పలికారు. ఇక పవన్ విషయానికి వస్తే.. ఎంతటి మహావీరుడైన తన తల్లి ముందు బిడ్డే అన్నట్లుగా మారిపోయారు.

తన తల్లి అంజనాదేవికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్.. తనకి మరో తల్లిదండ్రులు అయిన చిరంజీవి, సురేఖలకు కూడా పాదాభివందనం చేస్తూ తన విధేయతను చాటుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని చిరంజీవి నెట్టింట షేర్ చేయగా.. అది చూసి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. మెగా అభిమానులు అయితే కంటతడి పెట్టుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళ కల ఇది అంటూ ఎమోషనల్ అవుతున్నారు.

కేవలం అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు, సెలబ్రిటీస్ సైతం మెగా ఫ్యామిలీ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్నారు. యంగ్ హీరోలు నిఖిల్, కార్తికేయ.. ఆ వీడియో పై కామెంట్ చేస్తూ పోస్టులు వేశారు. ఆ వీడియో చూస్తుంటే.. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. నటి అనసూయ సైతం.. ఆనందబాష్పాలు వస్తున్నాయంటూ ఎమోజితో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.