Site icon HashtagU Telugu

Nikhil Siddartha : అమిత్ షా పిలిచినా నేను వెళ్ళలేదు.. నాకు ఏ పార్టీ డబ్బులివ్వట్లేదు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు…

Nikhil Siddartha comments on Amit Shah at Spy Pressmeet

Nikhil Siddartha comments on Amit Shah at Spy Pressmeet

యువ హీరో నిఖిల్(Nikhil) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఇప్పుడు స్పై(Spy) సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. నిఖిల్, ఐశ్వర్య మీనన్(Iswarya Menon) జంటగా గ్యారీ దర్శకుడిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘స్పై’. సుభాష చంద్రబోస్(Subhas Chandra Bose) రహస్యాల మీద ఈ సినిమాల తెరకెక్కుతున్నట్టు సమాచారం.

నిన్న మే 15న స్పై టీజర్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద లాంచ్ చేశారు. ఈ టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా నేడు హైదరాబాద్ లో స్పై చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి మీరు ఒక పార్టీ కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవమన్నారట? అని నిఖిల్ ని అడిగారు.

దీనికి నిఖిల్ సమాధానమిస్తూ.. నేను ఏ పార్టీ కోసం సినిమాలు చెయ్యట్లేదు. నాకు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. నేను చిన్నప్పటి నుంచి కృష్ణుడిని పూజిస్తాను అందుకే కార్తికేయ చేశాను. నా దగ్గరకు వచ్చే స్టోరీలలో ఇది బాగా నచ్చి చేస్తున్నాను. నేను నా ధర్మాన్ని నమ్ముతాను. నేను ఇండియన్ ని, ఇది ఇండియన్ సినిమా అంతే. నేను ఎవరి కోసం సినిమాలు చెయ్యట్లేదు. అమిత్ షా గారు నన్ను కలవమన్నారు నిజమే. కానీ నేను ఆయన్ని కలిస్తే మళ్ళీ రాజకీయంగా చూస్తారని నేను కలవలేదు. నాకు సినిమా వేరు, రాజకీయం వేరు. కార్తికేయ 2 సినిమా చూసి చాలా మంది రాజకీయ నాయకులు అభినందించారు. ఇప్పుడు స్పై సినిమాను కూడా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులకు ముందే చూపిస్తాము. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని తెలిపారు.

దీంతో అమిత్ షా కలవమన్నా నేను కలవలేదు అని నిఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై బీజేపీ నాయకులూ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

 

Prabhas Golden Heart: దటీజ్ ప్రభాస్.. రాధేశ్యామ్ కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చేసిన డార్లింగ్!