Site icon HashtagU Telugu

Ram Charan : చరణ్ తో మూవీ చేయడం లేదు..డైరెక్టర్ ఫుల్ క్లారిటీ

Ram Charan Nikhil Nagesh

Ram Charan Nikhil Nagesh

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) ప్రస్తుతం ‘RC 16’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా త్వరలో చరణ్ ఓ భారీ పౌరాణిక చిత్రంలో నటించనున్నారని , ‘కిల్’ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ (Nikhil Nagesh Bhatt), తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారని గత వారం రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.

CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..

ఈ క్రమంలో నిఖిల్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. చరణ్ తో సినిమా చేస్తున్నాను అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త స్టోరీతో త్వరలోనే సినిమా చేస్తానని తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇందులో కథ చెప్పే విధానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు. నిఖిల్ క్లారిటీ తో మెగా అభిమానుల్లో నెలకొని ఉన్న ఉత్కంఠ కు తెరపడినట్లు అయ్యింది.

ఇక RC16 విషయానికి వస్తే..

‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు సానా.. ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డెబ్యూతోనే 100 కోట్ల క్లబ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. అంతేకాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ ఫిలిం అవార్డ్ కూడా సాధించారు. దీంతో రెండో సినిమాకే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు నాలుగేళ్లు వెయిట్ చేసిన దర్శకుడు.. ‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్‌‌‌‌ రైటింగ్స్‌‌‌‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌‌‌‌ బ్యానర్స్‌‌‌‌పై కిలారు వెంకట సతీశ్‌‌‌‌ నిర్మిస్తున్నారు.