నిఖిల్ (Nikhil) హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. నవంబర్ 8న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా Appudo Ippudo Eppudo Trailer ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే రేసర్ అవ్వాలనుకునే హీరో పార్ట్ టైం గా వేరే వేరే పనులు చేస్తుంటాడు. అలాంటి టైం లో అతను రిస్క్ లో పడతాడు. దాని నుంచి అతను ఎలా తప్పించుకుంటాడు అన్నదే సినిమా కథ.
ఈ సినిమా ఎక్కువ శాతం ఫారిన్ లోనే షూట్ చేసినట్టు అనిపిస్తుంది. అసలు సినిమా ఎప్పుడు షూట్ చేశారన్నది కూడా తెలియకుండా పూర్తి చేశారు. నిఖిల్ సినిమా రిలీజ్ వారం ముందు నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఐతే ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ గానే ఉంది. అదీగాక రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) కి తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారైనా ఈ సినిమాను చూసే ఛాన్స్ ఉంది.
సినిమా అదిరిపోతుందని..
ఓ పక్క స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాలు చేస్తున్న నిఖిల్ మరోపక్క ఇలాంటి ఒక యాక్షన్ మూవీ చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ చాలా లో ప్రొఫైల్ లో జరుగుతున్నాయన్న టాక్ ఉంది. మరి సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా మారుతుందేమో చూడాలి.
నిఖిల్ మాత్రం సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా అదిరిపోతుందని అంటున్నాడు. సుధీర్ వర్మ తో స్వామిరారా (Swamirara) లాంటి హిట్ కొట్టిన నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో కూడా అలాంటి ఫలితాన్ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.