BJP leaders confuse: తెలంగాణ బీజేపీ అత్యుత్సాహం.. నితిన్ కాదు నిఖిల్!

తెలంగాణ లో ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు బీజేపీ నాయకత్వం శ్రీకారం చుటిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Nikhil

Nikhil

తెలంగాణలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు బీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖులు, సినీనటులు, క్రికెట్ లెజెండ్స్ తో మంతనాలు జరుపుతోంది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ న్యూస్ అటు రాజకీయాల్లో, ఇటు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐదు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో హీరో నితిన్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం జరిగింది. ఈ భేటీ పై పెద్దగా అంచనాలు లేకున్నప్పటికీ, ఆసక్తిని మాత్రం రేపింది.

అమిత్ షా-ఎన్టీఆర్‌ల భేటీలో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని రాసిన వ్యక్తులు జేపీ నడ్డాతో నితిన్ భేటీపై ఏమాత్రం నోరు విప్పలేదు. అయితే ఇటీవల విడుదలైన శ్రీకృష్ణుడు ఇతివృత్తం చుట్టూ తిరిగే ‘కార్తికేయ 2’తో భారీ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు హీరో నిఖిల్‌. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ హీరో నిఖిల్ తో భేటీ కావాలని కోరుకుందట. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు అత్యుత్సాహం కారణంగా నడ్డా నితిన్ తో సమావేశం కావాల్సి వచ్చింది. అయితే నడ్డా, నితిన్ భేటీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడం గమనించదగ్గ విషయం. మొత్తానికి బీజేపీ అగ్రనాయకత్వం ఒకటి తలిస్తే, తెలంగాణ బీజేపీ మరొకటి తలిచింది. కార్తీకేయ-2 ను సినిమాను పొలిటికల్ మైలేజ్ గా ఉపయోగించుకోవాలనుకున్న బీజేపీ నాయకత్వానికి దెబ్బ తగిలినట్టయింది. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

  Last Updated: 07 Sep 2022, 12:21 PM IST