Site icon HashtagU Telugu

Niharika No Clarity: ఇన్ స్టాలోకి నిహారిక రీఎంట్రీ.. డివోర్స్ పై సైలంట్!

Niharika

Niharika

మెగా డాటర్ కొణిదెల నిహారిక, ఆమె భర్త చైతన్య విడిపోయినట్టు, విడాకులు తీసుకుబోతున్నట్టు కొన్ని వారాలుగా మీడియా, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  మీడియాలో పుకార్లు వినిపించినప్పటికీ, అటు నిహారిక, ఇటు ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కానీ డివోర్స్ వార్తలపై రియాక్ట్ కాలేదు. అయితే మరోవైపు నిహారిక 14 వారాల పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉంది. ఆమె కొన్ని ప్రచార కంటెంట్‌ను మినహాయించి మూడు నెలలకు పైగా వేటినీ పోస్ట్ చేయలేదు.

సోమవారం నిహారిక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి కొత్త ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే విడాకుల విషయంలో మాత్రం ఎలాంటి పోస్టు కానీ, కామెంట్స్ చేయలేదు. కానీ ప్రస్తుతం నిహారిక ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి ఇంత అందగా ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎర్ర చీర కట్టి పిల్లర్‌ వద్ద కూర్చొని నిహారిక ఇచ్చిన పోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. కిల్లర్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. అమాయకంగా కనిపిస్తూ కట్టిపడేస్తుంది. విరహంతో చూస్తూ మత్తెక్కిస్తుంది. మొత్తంగా నిహారిక తనలోని అన్ని యాంగిల్స్ ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: Keerthy Suresh: వెన్నెల అందరికి కనెక్ట్ అయ్యే పాత్ర.. నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్: కీర్తి సురేష్