Niharika Konidela: అజ్ఞాతం వీడిన నిహారిక.. ఫొటోలు వైరల్!

నిహారిక కొణిదెల.. టాలీవుడ్ లో పాపులర్ నటి. పేరుకు చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోయినా

  • Written By:
  • Updated On - April 26, 2022 / 05:28 PM IST

నిహారిక కొణిదెల.. టాలీవుడ్ లో పాపులర్ నటి. పేరుకు చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తూ అభిమానులకు ఆకట్టుకునేది. ఇటీవల పబ్ రైడ్ ఘటనలో నిహారిక పట్టుబడటం.. మెగా కుటుంబం ఆంక్షలు విధించడంతో కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయారు. పబ్ ఘటన ఇటు వ్యక్తిగతంగా,  అటు కెరీర్ పరంగా నిహారికపై ప్రభావం చూపింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బయట అడుగు పెట్టింది. తన జిమ్ ట్రైనర్‌తో కొత్త హెయిర్‌స్టైల్‌లో కనిపించింది. అయితే సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకా.. ఏదైనా సినిమా ప్రిపరేషన్ కోసమా అనేది తెలియాల్సి వచ్చింది.

హైదరాబాద్‌లో పబ్ అండ్ పార్టీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భాగ్యనగరం డ్రగ్స్ వాడకానికి అడ్డాగా మారుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పోలీసులు హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో దాడులు నిర్వహించగా, ఇందులో రాహుల్ సిప్లీగంజ్, నిహారిక కొణిదెల సహా పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అయితే ఈ ఘటనపై నిహారిక తండ్రి నాగాబాబు రియాక్ట్ అవుతూ డ్రగ్స్ తో తన కూతురికి ఎలాంటి సంబంధం లేదని తెల్చి చెప్పాడు. అయితే పబ్ ఇష్యూపై నిహారిక భర్త ఫ్యామిలీ మాత్రం సీరియఎస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇష్యూ తర్వాత వాళ్లిద్దరూ కలిసిన సందర్భాలు కూడా తక్కువేనట. దీంతో నిహారిక దాంపత్యంపై పలు వార్తలు వినవస్తున్నాయి. పెళ్ళైనా కూడా నటిస్తున్న తారలు ఎందరో ఉన్నారు. అయితే లేట్ నైట్ పార్టీలు, డ్రగ్స్ వివాదాల కారణంగా నిహారిక విమర్శల పాలవుతున్నారు. వివాహితకు లేట్ నైట్ పార్టీలు అవసరమా నెటిజన్స్ సైతం ట్రోల్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.