మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నిహారిక ఒకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే నిహారిక ఇటీవలే తమిళంలో యాక్షన్ డ్రామాగా వచ్చి మద్రాస్కారణ్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. కాగా ఇందులో నిహారికతో పాటు షేన్ నిగమ్, కలైయరాసన్, ఐశ్వర్య దత్తా కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈసినిమా దాదాపు రూ.80 లక్షలు రాబట్టింది. అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా హిట్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈనెల మొదట్లోనే తమిళ్ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు మూవీ మేకర్స్. మద్రాస్కారణ్ సినిమా తెలుగు వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో బుధవారం ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ విషయాన్ని తాజాగా ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఒక చిన్న వాగ్వాదం వాళ్ల జీవితాలను మార్చే సంఘర్షణకు దారి తీసింది.
ఒక్క క్షణం ఎప్పటికీ మన దృక్పథాన్ని, పరిస్థితులను మార్చేస్తుందో చూడండి. మద్రాస్కారణ్ ఫిబ్రవరి 26 నుంచి ఆహాలో అంటూ క్యాప్షన్ ను కూడా జోడించింది. ఈరోజు నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.. సత్య (షేన్ నిగమ్)తో మీరా (నిహారిక) పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి పనుల్లో ఉండగా సత్య ఒకే యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదంలో కళ్యాణి గాయపడుతుంది. దీంతో సత్య పై దురైసింగం అనే వ్యక్తి పగను పెంచుకుంటాడు. సత్య కుటుంబంపై దురైసింగం ఎటాక్ చేస్తారు ? ఆ తర్వాత ఏం జరిగింది? నిహారిక జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. .