Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చాలా హుందాగా కనిపిస్తుంటారు. ఎక్కువ మాట్లాకుండా, ప్రతి ఒక్కరితో చాలా హుందాగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఇది కేవలం రామ్ చరణ్ ని దూరం నుంచి చూసిన వారి మాట మాత్రమే. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారు మాత్రం.. రామ్ చరణ్ పెద్ద ఫిట్టింగ్ మాస్టర్, బాగా చీటింగ్ చేస్తూ టీజ్ చేస్తాడని చెబుతుంటారు. గతంలో శర్వానంద్, రానా, కియారా అద్వానీ.. చరణ్ గురించి ఈ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా చరణ్ గురించి వైరల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం నిర్మాతగా వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న నిహారిక.. తాజాగా ‘కమిటి కుర్రోళ్ళు’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నిహారిక వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో ఉన్న రీసెంట్ అండ్ లాస్ట్ స్వీట్ మెమరీ ఏంటని ప్రశ్నించారు.
దానికి ఆమె బదులిస్తూ.. “నేను రీసెంట్ గా ఒక కొత్త ఇంటిలోకి మారాను. ఆ సమయంలో మా కజిన్స్ చరణ్ అన్న, వరుణ్ అన్న, తేజ్, వైష్ణవ్ అందరం కలుసుకున్నాము. ఆ రోజు ఒక రెండు గంటలు పాటు అన్ని టెన్షన్స్ పక్కన పెట్టేసి బాగా ఎంజాయ్ చేసాము. డమ్ శరాస్ అందుకున్నాము. చరణ్ అన్న ఈ గేమ్ ఆడారు అంటే ఎవరు నమ్మరు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక జవాబు విన్న విలేకరి.. డమ్ శరాస్ లో ఎవరు గెలిచేవారు..? అని ప్రశ్నించాడు.
దానికి నిహారిక బదులిస్తూ.. “చరణ్ అన్న పెద్ద చీటర్, చాలా చీటింగ్ చేస్తాడు. కాబట్టి చరణ్ అన్ననే గెలిచేవాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
#GameChanger Changes the game by cheating anta wah anna wah 😂@AlwaysRamCharan #RamCharan #GameChanger pic.twitter.com/oZaFVyDLCB
— alwaysRC (@Shaik_usman18) August 5, 2024