Site icon HashtagU Telugu

Niharika Konidela: నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Niharika Konidela

Niharika Konidela

Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) మొదటి వివాహం, రెండో పెళ్లి ఊహాగానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. అయితే 2023లో వారు విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు.. నిహారిక మొదటి పెళ్లి ఆమె ఇష్టం లేకుండా జరిగిందని, అది తమ తప్పిదమని సంచలనంగా వెల్లడించారు. “నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాం. మాదే తప్పు. ఆమె విడాకుల తర్వాత మ‌ళ్లీ పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని నాగబాబు తెలిపారు.

నిహారిక రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. “నిహారిక ఇప్పుడు స్వతంత్రంగా ఉంది. తన జీవితాన్ని తాను నిర్ణయించుకుంటుంది. ఆమె ఇంకో అబ్బాయిని చూసుకుంటుందని” నాగబాబు సూచనప్రాయంగా చెప్పారు. అయితే, నిహారిక రెండో వివాహానికి సంబంధించి ఆమె లేదా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: Health : ఉప్పు ఎక్కువ, తక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా!.. అప్పుడు ఏం చేయాలి?

2024లో ఒక పోడ్‌కాస్ట్‌లో నిహారిక తన విడాకుల గురించి మాట్లాడుతూ.. “నేను 30 ఏళ్లలోనే ఉన్నాను. ప్రేమకు నా హృదయం మూసుకోలేదు. కానీ ముందు స్వతంత్రంగా ఉండి, నన్ను నేను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాను” అని చెప్పారు. నాగబాబు కూడా ఆమె నిర్ణయాలకు మద్దతుగా నిలిచారని, ఆమె సంతోషమే ముఖ్యమని పేర్కొన్నారు. నిహారిక మొదటి వివాహం ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగినప్పటికీ, విడాకుల తర్వాత ఆమె సినిమా నిర్మాణంపై దృష్టి సారించారు. రెండో పెళ్లి గురించి స్పష్టత లేనప్పటికీ నాగబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

కూతురు నిహారిక పెళ్లి విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అన్నారు. వారిద్దరినీ సరిగ్గా అంచనా వేయలేకపోయాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోయారని చెప్పుకొచ్చారు. విడాకుల నుంచి ఇప్పుడిప్పుడే నిహారిక బయటపడుతోంది. ఒకరోజు తను మరో అబ్బాయిని కలుస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. తన విషయాల్లో కలగజేసుకోవాలనుకోవట్లేదు. నా పిల్లలు వారికి నచ్చినట్లు జీవించాలని కోరుకుంటాను అని తెలిపారు.

Exit mobile version