Allu Arjun : అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్.. నిహారిక కామెంట్స్ ఏంటి?

అల్లు అర్జున్‌ని సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడం విషయం పై మెగా వారసురాలు నిహారిక కామెంట్స్ ఏంటి?

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 11:03 AM IST

Allu Arjun : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలు.. రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుతో పాటు మెగా, అల్లు కుటుంబాలు మధ్య గ్యాప్ కూడా తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. వైసీపీ పార్టీ పై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటంలో మెగా హీరోలంతా తోడుగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం.. వారందరికీ విరుద్ధంగా వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసారు. ఈ విషయం మెగా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా కుటుంబసభ్యులు కూడా ఇన్‌డైరెక్ట్ గా అల్లు అర్జున్ పై అసహనం తెలియజేస్తున్నారు.

వైసీపీ లీడర్ కోసం అల్లు అర్జున్ చేసిన ప్రచారం అనంతరం మెగా బ్రదర్ నాగబాబు ఒక వైరల్ ట్వీట్ చేసారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్.. అల్లు అర్జున్ ని ఉద్దేశించిందేనంటూ అందరూ భావించారు. నాగబాబు తరువాత మరో మెగా ఫ్యామిలీ మెంబెర్ సాయి ధరమ్ తేజ్.. తన ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి అల్లు అర్జున్ ని అన్‌ఫాలో కొట్టారు. దీంతో మెగా వెర్సస్ అల్లు వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయం గురించి రీసెంట్ గా మెగా వారసురాలు నిహారికని ప్రశ్నించగా, ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “సాయి ధరమ్ తేజ్ గారు అల్లు అర్జున్ గారిని అన్‌ఫాలో చేయడం వెనుక కారణం ఏంటి..? ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమా..?” అంటూ ప్రశ్నించారు. దీనికి నిహారిక బదులిస్తూ.. “నాకు దాని గురించి పెద్దగా తెలియదు. కానీ ఒకవేళ అలా చేసి ఉంటే, ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.