తెలుగులో హీరోయిన్ గా మూడు నాలుగు సినిమాలు చేసి అది వర్క్ అవుట్ అవ్వక సినిమాలు మానేసి పెళ్లి చేసుకున్న నిహారిక మ్యారీడ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉంటుంది. అమ్మా నన్న, అన్న వదినలు ఆమెను హ్యాపీగా చూసుకుంటున్నారు. ఐతే నిహారికలో ఉన్న ఆ నటించాలన్న దాహం తీరలేదు. ఎలాగు ప్రస్తుతం సింగిలే కాబట్టి మళ్లీ సినిమాలు ట్రై చేస్తుంది. తెలుగులో నిర్మాతగా ఆమెకు ఉన్న టేస్ట్ ఏంటన్నది కమిటీ కుర్రాళ్లు సినిమాతో చూపించింది.
నిహారిక (Niharika,) తమిళ్ లో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె మద్రాస్ కారన్ (Madraskaran) సినిమాలో నటిస్తుంది. షేన్ నిగం (Shane Nigam) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి కాదల్ సుడుగుడు సాంగ్ రిలీజైంది. ఇది ఏ ఆర్ రెహమాన్ సఖి సినిమా కోసం చేశాడు. ఆ పాటని రీమిక్స్ చేసి మద్రాస్ కారన్ లో పెట్టారు.
సాంగ్ కు తగినట్టుగానే నిహారిక ఫుల్ రొమాంటిక్ గా కనిపించింది. మెగా ఫ్యాన్స్.. తన ఫాలోవర్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆలోచించకుండా నిహారిక తన బోల్డ్ అటెంప్ట్ తో షాక్ ఇచ్చింది. ఐతే డిజిటల్ కాలంలో ఉన్న మనం ఆమె తమిళ్ లో ఇలా రెచ్చిపోతే కనిపెట్టలేని పరిస్థితిలో లేము కదా.. అందుకే తమిళ్ లో రిలీజైన మద్రాస్ కారన్ సాంగ్ గురించి తెలుగు మీడియాలో భారీ చర్చ జరుగుతుంది.
ఏది ఏమైనా నిహారిక తన లోని నటిని బయటకు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి నిహారిక ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి.