Tollywood : నాగబాబు..నిహారికకు రెండో పెళ్లి చేయబోతున్నాడా..?

నాగబాబు సైతం..వరుణ్ పెళ్లిలోనే నిహారిక పెళ్లి కూడా చేయాలనీ అనుకుంటున్నాడట. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి తో పాటు నిహారిక పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలనీ అనుకుంటున్నాడట

Published By: HashtagU Telugu Desk
Niharika Heading For Second Marriage

Niharika Heading For Second Marriage

చిత్రసీమలో మెగా ఫ్యామిలీ (Mega Family)కి ఎంత పేరు ఉందో..అదే రేంజ్లో ఓ విమర్శ మాత్రం వెంటాడుతూనే ఉంది. అదే పెళ్లిళ్ల గురించి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట నందిని ని , రెండోసారి రేణును చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్లు ఇష్టపూర్తిగానే చేసుకున్నారు..ఇష్టపూర్తిగానే విడిపోయారు. తర్వాత మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు. అయినప్పటికీ పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆయన్ను కొంతమంది వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారు.

అలాగే చిరంజీవి (Chiranjeevi Daughters) కూతుళ్ల విషయంలో కూడా విమర్శలు చిరంజీవికి తగులుతూనే ఉంటాయి. పెద్ద కుమార్తె సుస్మితను ..హీరో ఉదయ్ కిరణ్ కు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇవ్వలేదు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. ఇక రెండో కూతురు శ్రీజ సైతం తల్లిదండ్రులకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. తర్వాత రెండో వివాహం తీసుకుంది. ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు మూడో పెళ్లికి సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం తెలియదు.

Read Also : Tollywood : వివాదంలో హీరో నాగార్జున ఫ్యామిలీ..

ఇక నాగబాబు కూతురు నిహారిక (Niharika) విషయానికి వస్తే..పెద్దల సమక్షంలో చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకుంది. కొంతకాలానికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రెండో వివాహం చేసుకునేందుకు సిద్దమైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగబాబు సైతం..వరుణ్ పెళ్లిలోనే నిహారిక పెళ్లి కూడా చేయాలనీ అనుకుంటున్నాడట. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి తో పాటు నిహారిక పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలనీ అనుకుంటున్నాడట. ప్రముఖ బిజినెస్ మ్యాన్ కొడుకుని నిహారికకి ఇచ్చి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఫిలిం సర్కిల్లో మాత్రం చక్కర్లు కొడుతుంది.

  Last Updated: 18 Sep 2023, 01:45 PM IST