Rapper Nicki Minaj: డ్రగ్స్ కేసులో హాలీవుడ్ రాపర్ నిక్కీ మినాజ్ అరెస్ట్

నిక్కీ మినాజ్ 'పింక్ ఫ్రైడే' మరియు 'బిల్‌బోర్డ్' చిత్రాలతో వెలుగులోకి వచ్చింది. నిక్కీ మినాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిక్కీ మినాజ్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే దీనికి కారణం ఆమె పాటలు కాదు, డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టు కావడమే.

Published By: HashtagU Telugu Desk
Rapper Nicki Minaj

Rapper Nicki Minaj

Rapper Nicki Minaj: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తారలు డ్రగ్స్ తీసుకుంటున్నారనే చర్చలు సర్వసాధారణం. దీనికి సంబంధించిన ఏదైనా విషయం వెలుగులోకి వచ్చినప్పుడు హడావుడి మాములుగా ఉండదు. పైగా ఇలాంటి కేసుల్లో పట్టుబడితే ఎంతటి వారినైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు. తాజాగా హాలీవుడ్ రాపర్ మరియు పాటల రచయిత నిక్కీ మినాజ్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఆమె ఆమ్‌స్టర్‌డామ్‌లో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయింది.

నిక్కీ మినాజ్ ‘పింక్ ఫ్రైడే’ మరియు ‘బిల్‌బోర్డ్’ చిత్రాలతో వెలుగులోకి వచ్చింది. నిక్కీ మినాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిక్కీ మినాజ్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే దీనికి కారణం ఆమె పాటలు కాదు, డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టు కావడమే. ఆమె తాజాగా విమానాశ్రయం నుండి ఒక వీడియోను పంచుకున్నారు. ఆమెను కస్టమ్ అధికారులు విచారిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. నిక్కీ లగేజీని తనిఖీ చేయడంపై చర్చ జరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. పోలీసు అధికారి ఆమెను పోలీస్ స్టేషన్‌కి వెళ్లమని, ఆమెను కారులో కూర్చోమని పదేపదే అడిగారు, కానీ ఆమె తన లాయర్ వచ్చే వరకు వెళ్లనని చెప్పింది. మొత్తానికి నాటకీయ పరిణామాల అనంతరం రాపర్ నిక్కీ విడుదలైంది.

నిక్కీ మినాజ్ ‘పింక్ ఫ్రైడే 2 వరల్డ్ టూర్’ కోసం ఆమ్‌స్టర్‌డామ్ నుండి ఇంగ్లండ్‌కు వెళ్తున్నారు.ఎయిర్‌పోర్టులోనే డ్రగ్స్ తీసుకెళ్తున్నారనే ఆరోపణలపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిక్కీ బ్యాగులో గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసులో ఆమెను అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత విచారణ అనంతరం విడుదల చేశారు. నిక్కీ పోలీసు అధికారులకు జరిమానా చెల్లించిన తర్వాత, ఆమె విడుదలైంది.

Also Read: Rishi Sunak : మరోసారి గెలుపు కోసం రిషి సునాక్‌ కసరత్తు

  Last Updated: 26 May 2024, 11:21 AM IST