Site icon HashtagU Telugu

Telugu Movies: ఏప్రిల్ ఆఖరి వారంలో ఓటీటీ, థియేటర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే?

Telugu Movies

Telugu Movies

ఇటీవల కాలంలో ఓటీటీ, థియేటర్ లలో పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్లో విడుదల అవుతున్నాయి. ఒకవైపు థియేటర్ లలో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుండగా మరోవైపు ఓటీటీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అల్లరిస్తున్నాయి. ఇక ఏప్రిల్ చివరివారం అనగా ఈ వారం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పొన్నియిన్‌ సెల్వన్‌ 2 సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పార్ట్ వన్ విడుదల అయ్యి తమిళంలో సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే. మరి పొన్నియిన్‌ సెల్వన్‌ 2 ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రారా పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీల నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే జల్మరీ హెలెండర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమా శిసు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు, హిందీలోనూ విడుదల కానుంది. నాని కీర్తి సురేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దసరా సినిమా ఇటీవలె విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 27వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అలాగే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ సిటాడెల్‌. రిచర్డ్‌ మ్యాడన్‌, ప్రియాంక చోప్రా,జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తొలి రెండు ఎపిసోడ్‌లను స్ట్రీమింగ్‌కు కానుంది. ఆ తర్వాత మే నెలలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదల కానుంది. అలాగే జి ఫైవ్ లో 28న వ్యవస్థ అనే వెబ్ సిరీస్ కూడా విడుదల కానుంది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌ విడుదల కానున్న వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. కోర్ట్‌ లేడీ అనే హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్‌ 26న స్ట్రీమింగ్ కానుంది. నోవోల్యాండ్‌ అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 26 స్ట్రీమింగ్ కానుంది. ది గుడ్‌ బ్యాడ్‌ మదర్‌ అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 27 స్ట్రీమింగ్ కానుంది. ఎకా అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్‌ 28 న స్ట్రీమింగ్ కానుంది. బిఫోర్‌ లైఫ్‌ ఆఫ్టర్‌డెత్‌ అనే హాలీవుడ్ సిరీస్ ఏప్రిల్‌ 28 స్ట్రీమింగ్ కానుంది. కాగా అమెజాన్‌ ప్రైమ్‌ లో ట్రైనింగ్ కానున్న సినిమాల విషయానికి వస్తే .. పత్తు తల అ ఈ తమిళ చిత్రం ఏప్రిల్‌ 27 స్ట్రీమింగ్ కానుంది. అలాగే జీ5 యూటర్న్‌ అనే హిందీ సినిమా ఏప్రిల్‌ 28 స్ట్రీమింగ్ కానుంది. అదేవిధంగా బుక్‌ మై షోలో స్క్రీమ్‌ 6 హాలీవుడ్ చిత్రం ఏప్రిల్‌ 26 స్ట్రీమింగ్ కానుంది. కాగా సోనీలివ్ లో తురముఖమ్‌ అనే మలయాళ చిత్రం ఏప్రిల్‌ 28న స్ట్రీమింగ్ కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్‌ సేవ్‌ ది టైగర్స్‌ తెలుగు సిరీస్‌ ఏప్రిల్‌ 27 స్ట్రీమింగ్ కానుంది. పీటర్‌ పాన్‌ అండ్‌ వెండీ హాలీవుడ్ సినిమా ఏప్రిల్ 28 స్ట్రీమింగ్ కానుంది.