Site icon HashtagU Telugu

Pushpa 2: సరికొత్తగా పుష్ప 2 లుక్.. పార్ట్ 1తో పోలిస్తే తేడాలేంటో తెలుసా..?

Puhspaa

Puhspaa

Pushpa 2:అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీకి సంబంధించి ఓ వెరైటీ లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ చాలా విభిన్నంగా ఉన్నాడు. గత లుక్‌లకు భిన్నంగా ఈ లుక్ చాలా కొత్తగా ఉంది. దీంతో ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చిత్తూరు. నెల్లూరు జిల్లాల్లో జరిగే గంగమ్మ జాతరలో చాలామంది పురుషులు సరికొత్త వేషాధారణలో కనిపిస్తారు.

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే వేషధారణలో కొత్తగా కనిపించాడు. అల్లు అర్జున్ చేతిలో ఓ గన్ కూడా కనిపించింది. ఈ లుక్‌ చాలా కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే పుష్ప 1లో కూడా అల్లు అర్జున్ లుక్ కొత్తగా అనిపించింది. డీ గ్లామర్ పాత్రలో గుబురు గడ్డంతో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో బన్నీ కనిపించాడు. ఈ సారి అందుకు భిన్నంగా మరో కొత్త లుక్‌లో కనిపించాడు. దీంతో పాత లుక్‌ను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.

పుష్ప పార్ట్ 1లో గుబురు గడ్డంతో అల్లు అర్జున్ కనిపించగా.. పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూ చేసినట్లు తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ను చూస్తే అర్ధమవుతుంది. పుష్ప 1లో అల్లు అర్జున్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు పార్ట్ 2లో కూడా అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పార్ట్ 1లో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఇప్పుడు పుష్ప 1 కలెక్షన్లను పుష్ప 2 బద్దలు కొట్టేలా ఉంది.ఈ సినిమాను మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు.

Exit mobile version