Devara : ఎన్టీఆర్(NTR) దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి హైప్ ఇవ్వడమే కాకుండా వరుసగా ఇంటర్వ్యూలు కూడా రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 సినిమా రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ వారం దేవర సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ ని రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ లోపు దేవర నుంచి కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఓ భారీ కత్తిని పట్టుకొని నిల్చున్నాడు. ఆ కత్తికి బొట్టు పెట్టి పూజ చేసి ఉంది. ఈ పోస్టర్ రిలీజ్ చేసి.. బాక్సాఫీస్ ఆయుధపూజ సెప్టెంబర్ 27 నుంచి మొదలుకానుంది అని రాసుకొచ్చారు.
దీంతో దేవర కొత్త పోస్టర్ వైరల్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా వైడ్ దేవర సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
Box Office Aayudha Pooja ignites from September 27th! 🔥#Devara #DevaraOnSep27th pic.twitter.com/ENvo7MlEOH
— Devara (@DevaraMovie) September 16, 2024
Also Read : Manchu Vishnu : ‘టిక్కీ’ని పరిచయం చేసిన మంచు విష్ణు.. కన్నప్పలో గుర్రంతో రియల్ స్టంట్స్..