Site icon HashtagU Telugu

Naga Chaitanya: ‘లాల్ సింగ్ చెడ్డా’ లో నాగ చైతన్య లుక్ ఇదే!

Lal Singh Chaddha

Lal Singh Chaddha

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం గమనార్హం. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఈయన ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇందులో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు చైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు అక్కినేని హీరో. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చూశారు. షో అయిపోయిన తర్వాత అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ గురించి.. చైతన్య పాత్ర గురించి బాగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని.. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటున్న అని తెలిపారు చిరంజీవి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Exit mobile version