Site icon HashtagU Telugu

Akhil Akkineni: అక్కినేని అఖిల్ సినిమాల లైనప్

Akhil Akkineni

Akhil Akkineni

Akhil Akkineni: సినిమా కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ కు సరైన బ్లాక్ బ్లాస్టర్ పడింది లేదు. రీసెంట్ గా విడుదలైన ఏజెంట్ సినిమా ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పక్క కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రొటీన్ కథ, కథనంతో సినిమా ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం అఖిల్ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా అఖిల్ కొత్త సినిమాల లైనప్ కూడా కేజ్రీగా ఉంది.

అఖిల్ కొత్త సంవత్సరం నుంచి కెరీర్ పై పోకస్ పెట్టనున్నాడని తెలిసింది. ప్రస్తుతం యువీ బ్యానర్ లో చేసే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని.. దాదాపుగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే అఖిల్ తో 100 కోట్ల బడ్జెట్ మూవీ అంటే రిస్క్ అని ఆలోచనలో పడ్డారట మేకర్స్. ఈ సినిమాని జనవరి లేదా ఫిబ్రవరిలో అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఈసారి రెండు సినిమాలను ఒకేసారి చేయాలి అనుకుంటున్నాడట. మరో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించనున్నారు. దీనికి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సివుంది. ఈ సినిమాకి సంబంధించి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసారని తెలిసింది. ఈ రెండు సినిమాల విషయంలో ఎలాంటి తేడా జరగకూడదనే ఉద్దేశ్యంతో నాగార్జున స్క్రిప్ట్ విషయంలో కేర్ తీసుకుంటున్నారని అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ . మరి ఈ రెండు సినిమాలతో అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Also Read: TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

Exit mobile version