Site icon HashtagU Telugu

7 Days 6 Nights:సంక్రాంతి బరిలో మెగా మేకర్ ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’ !!

Whatsapp Image 2022 01 02 At 18.38.27 Imresizer

Whatsapp Image 2022 01 02 At 18.38.27 Imresizer

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ తరువాత ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో సంక్రాంతి రిలీజ్ బరిలో దిగనున్నారు.

మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నేను నా కెరీర్ లో అన్ని జానర్ చిత్రాలు చేసాను, ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి చేద్దామనుకుంటున్నాను. నా ‘డర్టీ హరి’ పోస్టర్లు చూసి నేనిలా అయిపోయాను అని చెవులు కొరుక్కున్న వారు చిత్రంలోని చివరి 40 నిమిషాలకి ఇచ్చిన స్పందన ఇప్పటికీ గుర్తుంది. అదే పంథాలో నాకు నచ్చేలా అందరూ మెచ్చేలా ఈసారి ఒక న్యూ జెన్ రోమ్-కామ్ చిత్రంతో అన్ని రకాల ప్రేక్షకులని అలరించబోతున్నాం. బాచిలర్ ట్రిప్ కోసం గోవా కి వెళ్లిన 2 యువకులు, 2 యువతుల చుట్టూ జరిగే కథ ఇది. క్లాసిక్ చిత్రంగా మారే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరు, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్ చేసుకుంటారు. సంక్రాంతి కి రానున్న ఈ చిత్రం, అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం” అని అన్నారు.

సంక్రాంతి బరిలోని భారీ చిత్రాల మధ్య విడుదల చేస్తూ కూడా ఎం. ఎస్. రాజు ఈ చిత్ర విజయం పై పూర్తి విశ్వాసం తో ఉండడం విశేషం.

Exit mobile version