Site icon HashtagU Telugu

Ram Gopal Varma: వర్మ మన కర్మ.. ఆర్జీవీపై దారుణంగా ట్రోలింగ్స్

Varma cult movies

Varma

రాంగోపాల్ వర్మ(RGV) అనగానే.. శివ, సర్కార్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందు కదలాడుతాయి. ఆ సినిమాలు వర్మ (RGV) పనితీరుకు అద్దం పడతాయి. యువ డైరెక్షర్లకు స్పూర్తిగా నిలుస్తాయి. కానీ ప్రస్తుతం వర్మం అంటే సెక్స్, వల్గర్, బూతులు, వెకిలి చేష్టలు మాత్రమే గుర్తుకువస్తున్నాయి. నటి ఆశు రెడ్డి కాళ్లను సక్ చేసిన వీడియో వైరల్ కావడంతో రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఆ వీడియోను ఆర్జీవీ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. ఇది అతని రాబోయే లెస్బియన్ చిత్రం డేంజరస్‌ని ప్రమోట్ చేయడానికి అతని ప్రచార స్టంట్. ఆర్జీవీ అసహ్యంగా, అసభ్యంగా ఉన్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

తన సినిమాను ప్రమోట్ చేయడానికి చాలా దిగజారిపోయాడని సోషల్ మీడియాలో అతనిపై విరుచుకుపడుతున్నారు. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వర్మ శివ మూవీ 7 డిసెంబర్ 1990న విడుదలైంది. ఈ మూవీ వర్మ క్రియేవిటికీ నిదర్శనంగా నిలిచింది. ఆ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక కల్ట్‌ (Cult)గా మారి దేశంలో చిత్ర నిర్మాణ గమనాన్ని మార్చేసింది. ఇక 32 ఏళ్ల త‌ర్వాత అదే రోజున ఆర్జీవీ సోష‌ల్ మీడియాలో అశురెడ్డితో అసహ్యంగా కనిపించి ట్రోల్స్ కు తెరలేపాడు.

సినిమాలయందు రామ్‌ గోపాల్‌ వర్మ (RGV) తీసే సినిమాలు వేరయా అని అంటారు. భారతీయ సినిమా అప్పటివరకు చూడని సినిమాలను చూపించి వావ్‌ అనిపించారు వర్మ. అదే సమయంలో దారుణమైన చిత్రరాజాలు తెరకెక్కించారు. ఆ సినిమా పేర్లు చెబితే ఆయన ఫ్యాన్స్‌ ఆఖరికి డైహార్డ్‌ ఫ్యాన్స్‌ కూడా ఉలిక్కి పడే సినిమాలు చేశారు. ఈ సంవత్సరం ఆయన నుండి ఎన్ని సినిమాలు వచ్చాయి, వచ్చి ఏమయ్యాయి అనేది కూడా గుర్తులేనంతగా మారిపోయింది ఆయన కెరీర్‌.

Also Read: Salman Likes Pooja: టాలీవుడ్ బ్యూటీపై మనసు పారేసుకున్న సల్మాన్.. పూజకు క్రేజీ ఆఫర్!