Site icon HashtagU Telugu

Mehreen Looks: బక్కచిక్కిపోయిన మెహ్రీన్.. లేటెస్ట్ లుక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్

Mehreen

Mehreen

నటి మెహ్రీన్ (Mehreen) సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో (Social Media) ఎక్కువగా కనిపిస్తోంది. వినిపిస్తోంది. ఎఫ్3 (F3) మూవీ తర్వాత ఈ బ్యూటీ ఏ సినిమాల్లో నటించలేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అభిమానులకు టచ్ లోకి వస్తోంది. అయితే హీరోయిన్స్ సన్నబడటం చాలా కామన్. కానీ మెహ్రీన్ విషయంలో ఇది తప్పయింది. బొద్దుగా కనిపించి, అందర్నీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ, పనిగట్టుకొని మరీ స్లిమ్ అయింది. ఏకంగా సైజ్ జీరో సాధించింది.  అంతా ఓకే అని ఆమె అనుకుంది. కానీ ఆమె లుక్ నాట్ ఓకే అంటోంది సోషల్ మీడియా.

అవును.. మెహ్రీన్ లుక్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ (Comments) పడుతున్నాయి. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది మెహ్రీన్. ఆ పిక్స్ లో బక్కపల్చగా కనిపిస్తోంది ఈ భామ. ఆమె ముఖంలో మెరుపు కూడా తగ్గిపోయింది. బక్కపల్చని పర్సనాలిటీతో మెహ్రీన్ బాగాలేదంటున్నారు (Trolles) చాలామంది. మునుపటిలా ఆమె కాస్త బొద్దుగా ఉంటేనే అందం అంటున్నారు.

మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా ప్రముఖ భారతీయ నటి, మోడల్. ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతొ చిత్రపరిశ్రమకి పరిచయమ్యారు. ఈ చిత్రం విజయం సాధించి పేరు తెచ్చింది. తరువాత తెలుగులోనె కాకుండా  తమిళ్, హిందీలో కూడ నటించింది. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ (Bollywood) లోకి అడుగుపెట్టింది ఆమె. నొటా, జవాన్, మహానుభావుడు, C/o సూర్యా వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

Also Read: Taxi Safe App: ఆటో ఎక్కుతున్నారా.. ‘ట్రేస్ మై లొకేషన్‌’ తో నేరాలకు చెక్!

 

Exit mobile version