పూనమ్ పాండే (Poonam Pandey) ..నిన్నటి నుండి ఈ పేరు మారుమోగిపోతుంది. సర్వేకల్ క్యాన్సర్ (Cervical Cancer) తో పూనమ్ చనిపోయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించే సరికి అందరు అయ్యో అంటూ బాధపడ్డారు. ముఖ్యంగా యూత్ అయితే మనోవేదనకు గురయ్యారు. శృంగార దేవత గా కొలిచే వారంతా మరణ వార్త ను తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా లో పూనమ్ మరణాన్ని వైరల్ చేసారు. ఇదే క్రమంలో కొంతమంది ఇదంతా ఫేక్ కావొచ్చు అని కామెంట్స్ కూడా చేసారు. నిన్నంతా ఈమె మరణం గురించే అంత మాట్లాడుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు స్వయంగా నేను బ్రతికే ఉన్నానని వీడియో పోస్ట్ చేయడం తో నిన్నంతా అయ్యో అన్నవారంతా ఛీ నువ్వు మనిషివేనా అని తిట్టడం మొదలుపెట్టారు. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే ఇలా చేసినట్టు తెలుపడం తో..ఇలా చెప్పడానికి సిగ్గుందా అంటూ ఓ రేంజ్ లో బూతులు వదులుతున్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం పూనమ్ కు కొత్తమీ కాదు. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియాంకు వస్తానని చెప్పి పూనమ్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తన భర్త ఫైనే పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. ఇలా ఫేమస్ కావడం కోసం పూనమ్ ఇలాంటివి చేస్తుందని మరోసారి రుజువైందని మండిపడుతున్నారు.
Read Also : Khammam MP Seat : ఖమ్మం ఎంపీ సీటు..ఇది చాల హాట్ గురూ..!!