Sitara Post: సితార పోస్ట్ పై నెటిజన్లు ఫైర్..

మహేష్ బాబు గారాలపట్టి సితార తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదాగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు స్పందన మరోలా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Netizens Fire On Sitara Post..

Netizens Fire On Sitara Post..

Sitara Post : టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు సినిమా హడావుడిలో ఉంటే కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో బిజీబిజీగా గడుపుతుంది. ఎప్పటికప్పుడు తన టాలెంట్ ని బయటపెడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంది. చిన్నవయస్సులోనే డాన్స్ మరియు సింగింగ్ లో సూపర్బ్ అనిపించుకున్న సితార (Sitara) తాజాగా విడుదలైన సర్కారు వారి పాటలోని పెన్నీ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఇక సోషల్ మీడియాలో కూడా సితార యమ యాక్టివ్ గా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే సితార తాజాగా వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఆమెను మెచ్చుకునే నెటిజన్లు ఈసారి సితారపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏమైందో చూద్దాం..

మహేష్ బాబు గారాలపట్టి సితార తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదాగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేయగా మరికొందరు పోస్ట్ ని ఉద్దేశించి వేరేలా స్పందించారు. తప్పు అమ్మ అలా చేయకూడదు, బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు. మరికొందరైతే ఎందుకిలా చేశావ్.. నువ్వు చేయడం చూసి మరికొందరు ఇలాంటి ఫీట్లు చేస్తారు.. వారికి జరగరానిది జరిగితే అంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ లో ఉండగా పిల్లలు అలా బయటకు చూస్తే ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఎంత బాధపడుతాయి అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం సితారకు మద్దతుగా నిలుస్తూ కారు ఆగి ఉన్నప్పుడే అలా ఫొటోకు ఫోజ్ ఇచ్చి ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీ హోదాలో ఉంటే ఇలాంటి కామెంట్స్ తప్పవు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అప్ కమింగ్ మూవీపై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. అరవింద సమేత, అలవైకుంఠపురం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న గురూజీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ అతడు, ఖలేజా సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మూడవ చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read:  Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…

  Last Updated: 09 Apr 2023, 03:53 PM IST