సోషల్ మీడియా సినీ సెలబ్రిటీలకు అభిమానులతో టచ్‌లో ఉండేందుకు మంచి వేదికగా మారింది. స్టార్ హీరోయిన్లు కూడా అప్పుడప్పుడూ అభిమానులతో లైవ్ చాట్‌లు చేస్తూ వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి చాట్ సెషన్‌లలో కొన్నిసార్లు అసభ్య ప్రశ్నలు ఎదురవుతూ ఇబ్బందికి గురి చేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan)కు ఓ నెటిజన్ (Netizen ) ఏకంగా “మీరు వర్జినేనా?” (Are you a virgin) అని ప్రశ్నించాడు. దీనికి ఆమె కోపపడకుండా, కానీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. “ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను” అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానం అతనికి గట్టి గుణపాఠంగా మారింది. సోషల్ మీడియాలో హీరోయిన్స్‌పై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు కామన్‌గా మారినప్పటికీ, నటీమణులు వీటిని సహించాల్సిన అవసరం లేదని మాళవిక తన సమాధానంతో చాటిచెప్పింది.
March 15 : ఈరోజు చంద్రబాబుకు ఎంతో స్పెషల్
మాళవిక మోహనన్ తమిళ సినిమాల్లో విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ ఛాన్స్ దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ మూవీలో మాళవిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మాళవిక తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. అంతేకాదు రాజాసాబ్ చిత్రంలో ఆమె యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించిందని, సెట్స్ నుంచి లీకైన కొన్ని వీడియోలు చూస్తే మార్కెట్‌లో రౌడీలను చితక్కొట్టే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.